తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు

భారత దేశంలో తుఫానొచ్చి గట్టిగా గాలి వీస్తే విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి రోజుల తరబడి చీకట్లో మగ్గవలసి రావడం పరిపాటి. మనిషి అభివృద్ధి చేసుకున్న ఆధునిక సాధనాలు ప్రకృతిపై మనిషి పై చేయి సాధించేందుకు దోహదం చేశాయి. అయితే ప్రకృతి విలయతాండవానికి తెగిస్తే అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటేననీ సాక్షాత్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ తో పాటు ఇంకా అనేక నగరాల కష్టాలే చెబుతున్నాయి. పెను తుఫాను ధాటికి 18 మంది మరణించడమే కాక…