కరాచిపై పాక్ తాలిబాన్ దాడులు, శాంతి ఎప్పటికి? -ఫోటోలు

‘ఆ, శాంతి గాక ఇక ఏమున్నదిలే!” అని సత్యహరిశ్చంద్రుడు కాటి సీన్ చివరి అంకంలో దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం పరిస్ధితి అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్ధాన్ ను ఖాళీ చేయడానికి అమెరికా ముహూర్తం పెట్టుకున్న నేపధ్యంలో తాలిబాన్ తో శాంతి చర్చలు ఫలించే సూచనలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఆఫ్ఘన్ తాలిబాన్ తో ఆఫ్ఘన్ ప్రభుత్వం శాంతి చర్చలు విఫలం అవుతుండగానే పాక్ తాలిబాన్ తో పాక్…

పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల్లోకి చొచ్చుకెళ్ళిన ఆల్-ఖైదా; విలేఖరి పరిశోధన

ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు…

ఆల్-ఖైదా, పాక్‌ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య

(విలేఖరి పరిశోధన అనంతరం తన మరణానికి ముందు రాసిన ఆర్టికల్ అనువాదం దీని తర్వాత పోస్టులో చూడండి) పాకిస్తాన్ గూఢచార సంస్ధకు ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలతో దగ్గరి సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఒసామా హత్య తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఒసామా పాక్‌లో తలదాచుకోడానికి కారణం పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో మిలిటెంట్ సంస్ధలకు సంబంధాలుండడమే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. ఆ తర్వాత పాక్ మంత్రి మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల…

పాకిస్ధాన్ నావల్ బేస్‌పై పాక్ తాలిబాన్ దాడి దృశ్యాలు -ఫోటోలు

సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు…

పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా

వరుసగా ఎదురవుతున్న అవమానాలతో పాక్ మిలట్రీ అందరినుండీ దూషణలను, తిరస్కారాలనూ ఎదుర్కొంటోంది. అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి లాడెన్ హత్య చేయనున్న విషయం తమకు తెలియకుండా జరిగిందని చెప్పడం, సి.ఐ.ఏ గూఢచారులు వందల సంఖ్యలో పాక్‌లో ఉన్నట్లు వెల్లడి కావడం, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినా సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ను ఏ శిక్షా లేకుండా విడిచిపెట్టడం, అవసరమైతే ఇంకోసారైనా పాక్‌లో జొరబడ్డానికి వెనకాడం అని ఒబామా ప్రకటించినా అదేమని అడగకుండా నోర్మూసుకుని…