కరప్షన్ వెల్త్ గేమ్స్ – 2010 -కార్టూన్

కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కూడా ఆరోపణలు చేసింది. సరిగా దర్యాప్తు చేయడం లేదని ఢిల్లీ హై కోర్టు మరోవైపు ఢిల్లీ పోలీసులను చెండాడుతోంది. అసలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధిపతిగా సురేష్ కల్మాడిని నియమించింది ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ చల్లగా చెప్పడంతో బి.జె.పి పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అప్పటికే సురేష్ కల్మాడిపై అనేక ఫిర్యాదులు…