బి.జె.పిలో మోడి, షా లదే రాజ్యం -కార్టూన్

కాంగ్రెస్ కంటే తమది విభిన్నమైన పార్టీ అని బి.జె.పి నేతలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో సంస్ధాగత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదని, కేవలం కుటుంబ స్వామ్యమే ఉన్నదని వెంకయ్యనాయుడు లాంటి నేతలు తరచుగా ఆరోపిస్తారు. అలాంటి బి.జె.పి లోనూ నేడు కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులదే ఇష్టా రాజ్యం అయిందని ఈ కార్టూన్ చెబుతోంది. బి.జె.పి చిహ్నం కమలంలో వికసించిన పూ రెమ్మలు మోడి అయితే, వాటికి పత్రహరితాన్ని పోషణగా అందించే ఆకులు అమిత్ షా అని కార్టూనిస్టు…

మోడి ఇమేజ్: కమలమా? టీ కప్పా? -కార్టూన్

“ఇదయితే మీ ఇమేజ్ కి బాగా సరిపోతుంది కదా, సార్?” పార్టీలోని వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని అందరూ అంగీకరించే సూత్రం. ఈ సూత్రం పార్టీలోని సామాన్య కార్యకర్తల నుండి అత్యున్నత నాయకులకు అందరికీ వర్తిస్తుందని ప్రతి పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా పార్టీ సిద్ధాంతాలకు, నిర్మాణానికి పెద్ద పీట వేయడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకుని పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పాటిస్తాయి. కానీ బి.జె.పి వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. “నరేంద్ర మోడి…