తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ
Special Intensive Revision in Bihar బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది. తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా…




