దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ
దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో…