హరికేన్ శాండి: ప్రమాదపు అంచున అమెరికా అణు కర్మాగారం!

అమెరికాలో పెను తుఫాను శాండీ విధ్వంసం సృష్టిస్తోంది. విద్యుత్ వ్యవస్ధ నాశనం కావడంతో పాటు వేలాది ప్రజల తరలింపును అమెరికా నెత్తిన రుద్దిన పెను తుఫాను అమెరికా తూర్పు తీరంలోని పాతికకు పైగా అణు కర్మాగారాలను కూడా భయపెడుతోంది. తుఫాను మార్గానికి దగ్గరగా ఉన్న ఈ అణు కర్మాగారాల్లో న్యూ జెర్సీ ఒడ్డున ఉన్న ఓయిస్టర్ క్రీక్ కర్మాగారంలో ఇప్పటికే అప్రమత్తత ప్రకటించినట్లు కార్పొరేట్ పత్రికలు తెలిపాయి. ఈ అణు కర్మాగారాన్ని శాండి నేరుగా తాకినట్లు తెలుస్తోంది.…