అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…