సునిశిత హాస్యం ఈ గీతల సొంతం -స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు

ఈ వీధి చిత్రాల్లో కళాకారులు పెద్దగా కష్ట పడినట్లు కనిపించదు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని గీతలనీ, రోజువారీ ఉపయోగం కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలనూ, ఉపకరణాలనూ ఆధారం చేసుకుని వారు అర్ధవంతమైన చిత్రాలు రాబట్టారు. తరచుగా ఈ చిత్రాల్లో కేవలం కొన్ని గీతలో, కొంత పాఠ్యమో, మహా అయితే రోజూ చూసే చిన్న చిన్న బొమ్మలో కనిపిస్తాయంతే. ఇలాంటి వీధి చిత్రాలు సృష్టించడంలో బ్యాంక్సీ (ఇంగ్లండ్) సిద్ధహస్తుడు. ఓక్ ఓక్ (ఫ్రాన్సు) కూడా. వీరద్దరు…