కాశ్మీర్ వరదలు: పట్టించుకునేవారు లేరు
“ఒక్క రాయి విసిరినా, ఆ ఒక్క వ్యక్తిని కొట్టడానికి వందల మంది పోలీసులు పరుగెట్టుకుని వస్తారు. వాళ్ళంతా ఇప్పుడేరి? మంత్రులు ఎక్కడ?” కాశ్మీర్ వరదల నుండి బైటపడిన ఒక కాశ్మీరీ టీచర్ వేసిన ప్రశ్నలివి. “హెలికాప్టర్లు వచ్చాయి, వెళ్ళాయి. మా సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. మా ఏరియాలో ఎవ్వరినీ హెలికాప్టర్ల ద్వారా రక్షించలేదు” తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న ఒక కాశ్మీరీ పౌరుడు వెల్లడించిన సత్యం. “ఈ ప్రభుత్వం ఇచ్చే ఆహారం మాకు అక్కర్లేదనీ జనం నిరాకరిస్తున్నారు.…