విధాన నిర్ణయాలు మా సార్వభౌమ హక్కు, ఒబామాకు ఇండియా సమాధానం

రిటైల్ అమ్మకాలు లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత దేశం అడ్డుపడుతోందన్న ఒబామా ఆరోపణను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలు చేసే బదులు ‘ప్రొటెక్షనిజం’ ను అరికట్టడంలో ఒబామా తన నాయకత్వ ప్రతిభ కనబరచాలని కోరింది. భారత దేశంలో విదేశీ రిటైల్ పెట్టుబడులు వాస్తవంగా పెరుగుతున్నాయనీ రిటైల్ పెట్టుబడులకు ఇండియాలో ఆటంకాలు లేవనడానికి అదే సాక్ష్యమని భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వివరించాడు. సంస్కరణలు అమలు చేయడంలో, సరళీకరణ విధానాలు చేపట్టడంలో ఇండియా వాస్తవానికి వేగంగా…

పాకిస్తానే కాదు అవసరమైతే ఏదేశంపైనైనా దాడి చేస్తాం! -ఒబామా

అమెరికా మరోసారి తన అహంభావాన్ని బైట పెట్టుకుంది. అధ్యక్షుడు ఒబామా నోటి ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు బుద్ధి మరోసారి బైట పడింది. అంతర్జాతీయ చట్టాలు తనకు పూచిక పుల్లతో సమానమని చాటి చెప్పుకుంది. టెర్రరిస్టు ఉన్నాడని తెలిస్తే పాకిస్ధాన్ పై మరోసారి అక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేస్తామని ఒబామా ప్రకటించాడు. అసలు పాకిస్ధానేం ఖర్మ, తాను చంపదలుచుకున్న వాళ్ళెవరైనా ఉన్నాడని తెలిస్తే ఏ దేశంపైనైనా దాడి చేస్తామని ప్రకటించాడు. తమకు కావలసింది అమెరికా ప్రజల…