అమెరికా ఋణ పరిమితి: సమీపిస్తున్న మరో గడువు
అమెరికా ఋణ పరిమితి పెంపుకు గడువు మరోసారి సమీపిస్తోంది. అమెరికా చెల్లింపులు చేయలేని పరిస్ధితికి త్వరలోనే వస్తుందని ఆ దేశ కోశాగార అధిపతి (ట్రెజరీ సెక్రటరీ) జాక్ ల్యూ హెచ్చరించాడు. ఫిబ్రవరి ఆఖరు వరకు ఖర్చులు గడుస్తాయని కానీ ఆ తర్వాత రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. గత సంవత్సరం తాత్కాలికంగా ఋణ పరిమితిని పెంచడం ద్వారా ఇరు పార్టీలు సంక్షోభం నుండి తృటిలో బైటపడినట్లు చెప్పాయి. ఒబామా కేర్ చట్టం…


