రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ 50 సం. పూర్తి చేసుకున్న బారక్ ఒబామా

నెలల తరబడి సాగిన వేడి వేడి చర్చల అనంతరం, ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఆగష్టు 4 తో 50 సంవత్సరాలు నిండాయి. ఆమెరికా కాంగ్రెస్‌లో మెజారిటీ ఉన్న రిపబ్లికన్ల నుండి దీని పట్ల తీవ్రం విమర్శలు వ్యక్తం అయ్యాయి. “ప్రస్తుతం ఈ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా, మనిషి జీవ పరిణామ క్రమంలో భాగమైన వయసు మీరే ప్రక్రియకు తన సమయాన్ని వెచ్చించడం, అమెరికన్లందరినీ అవమానించడమే” అని…