తూర్పు ఉక్రెయిన్: ఉక్రెయిన్ బలగాల లొంగుబాటు
తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల చుట్టివేత నుండి బైటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఉక్రెయిన్ పశ్చిమ అనుకూల ప్రభుత్వ బలగాలు ‘బ్రతుకు జీవుడా’ అంటూ లొంగిపోతున్నాయి. ‘ప్రత్యేక టెర్రరిస్టు అణచివేత కార్యక్రమం’ పేరుతో డోనేట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాలపైకి దండెత్తిన ఉక్రెయిన్ సైన్యం గత రెండు నెలలుగా అమానుష కృత్యాలకు తెగబడింది. విచక్షణా రహితంగా బాంబుదాడులు చేయడంతో 100 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఈ క్రమంలో రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని డాన్ బాస్ మిలీషియా చుట్టుముట్టడంతో…