ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి
ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…
