స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్
పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…