మారిషస్, ఐ.టి రేటింగ్ లతో నాలుగు నెలల కనిష్ట స్ధాయికి చేరిన ఇండియా షేర్ మార్కెట్లు

సోమవారం ఇండియా షేర్ మార్కెట్లు రెండు శాతం పైగా పతనమైనాయి. మారిషస్‌తొ పన్నుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సమీక్షనున్నదన్న భయాలు, ఇండియా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రేటింగ్‌ని తగ్గించడం షేర్ల పతనానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని కూడా వీరు భావిస్తున్నారు. సోమవారం పతనంతో భారత్ షేర్ మార్కెట్లు కొన్నాళ్ళపాటు కోలుకోవడం కష్టమనీ, సెంటిమెంట్ బలహీనపడ్డం వలన మరింత పతనం చవిచూడనున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు సోమవారం నాటి భారీ పతనాన్ని…