ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…