ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3
ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్…