‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ దిశ ఎటు? -కార్టూన్
అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.…

