అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20

ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20…