ఇ.యు షరతులు, పొదుపు ఆర్ధిక విధానాలపై గ్రీసు కార్మికుల సమర శంఖం

“ఈ ఆర్ధిక విధానాలు, పొదుపు చర్యలకు అనుకూలంగా ఓటు వేయాలంటే పులికి ఉండే క్రూరత్వం కలిగి ఉంటేనే సాధ్యం.” ఈ మాట అన్నది గ్రీకు పార్లమెంటు సభ్యుడు, జార్జి లియానిస్. ఈయన పాలక పార్టీ ఐన సోషలిస్టు పార్టీ సభ్యుడు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్ధ (IMF) లు సహాయం పేరుతో గ్రీసు కి ఇవ్వనున్న అప్పు కోసం గ్రీసు ప్రభుత్వం అమలు చేయవలసిన కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు, చర్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ…

పొదుపు చర్యలపై ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తున్న స్పెయిన్ యువత

ఇప్పటికే మూడు దేశాలను, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, బలితీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించడానికి స్పెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న పొదుపు చర్యలు స్పెయిన్ ప్రజలను వీదులపాలు చేస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధికంగా స్పెయిన్‌లో 21.3 శాతం నిరుద్యోగం ఉంది. పొదుపు విధానాల పుణ్యమాని ఇది ఇంకా పెరుగుతోంది. యువతలో నూటికి 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పరిస్ధితి ఇలా ఉంటే ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…

రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల్లో చిక్కుకున్న పోర్చుగల్, యూరప్ ని వెంటాడుతున్న అప్పు సంక్షోభం

గ్రీసు, ఐర్లండ్ లను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం ఇప్పుడు పోర్చుగల్ ని బలి కోరుతోంది. ఆర్ధిక సంక్షోభం పేరుతో పోర్చుగల్ ప్రధాని జోస్ సోక్రటీసు బడ్జెట్ లో ప్రతిపాదించిన కఠినమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓటువేయడంతో సోక్రటీసు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటీసు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్నాడు. బ్రసెల్స్ లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సభ యూరోపియన్…

పోర్చుగీసు అప్పు సంక్షోభం నేపధ్యంలో ఇ.యు శిఖరాగ్ర సమావేశం

బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో గురువారం జరగనున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో పోర్చుగీసు అప్పు సంక్షోభం పైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్యునీషియా, ఈజిప్టు పరిణామాలు ఎజెండా గా సమావేశం ఏర్పాడు చేసినప్పటికీ పోర్చుగీసు లో ప్రభుత్వ సంక్షోభం ముంచుకు రావడంతో సమావేశంలో ఆ అంశమే మిగతా అంశాలను పక్కకు నెట్టే పరిస్ధితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పోర్చుగీసు ప్రభుత్వం బడ్జేట్ లో తలపేట్టిన నాల్గవ విడత పొదుపు చర్యలను సమర్ధించడానికి ప్రతిపక్షాలు…