దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ముఖ్యమంత్రి రాకతో సాక్ష్యాలు భంగం

ముఖ్యమంత్రి తదితరుల వి.వి.ఐ.పి ల సందర్శన వలన పోలీసుల పరిశోధన ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడింది. వారితో పాటు ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం పేలుడు జరిగిన చోట్ల ఇష్టం వచ్చినట్లు తొక్కిపారేయడంతో కీలక సాక్ష్యాలు లభ్యం కాకుండా పోయాయి. పేలుడు జరిగాక జనం హాహాకారాలతో అటు ఇటు పరుగులు పెట్టడం సహజమే. కానీ ఆ పరుగులు కూడా కీలక సాక్ష్యాలలో భాగంగా ఉండవచ్చు. వారు కాకుండా బైటివారు రావడం వలన పేలుడు జరిగిన తర్వాత పరిసరాలలో…

ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలలోని మిలిటెంట్లు వాడుతున్న హోం మేడ్ బాంబుల ధాటికి అమెరికా ఠారెత్తుతోంది. అమెరికా, నాటో సైనికులను ఇంటి తయారీ బాంబులే వణికిస్తున్నాయి. ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’ (ఐ.ఇ.డి) గా పిలిచే ఈ బాంబులవల్లనే పలువురు అమెరికా, నాటో సైనికులు చనిపోవడంతో వాటిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక సతమతమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ అమెరికా తన నిస్సహాయతను అంతా పాకిస్ధాన్ పైన చూపిస్తోంది. ఐ.ఇ.డిలను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన…