ఐ.ఎం.ఎఫ్, ఇయు షరతుల ఫలితం, ఐర్లండు ప్రజలపై త్వరలో మరో విడత బాదుడు
బెయిలౌట్ మంజూరు చేస్తూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన షరతులతో పాటు రేటింగ్ ఏజన్సీలు, వివిధ బ్యాంకుల ఆర్ధికవేత్తల ఒత్తిడి పెరగడంతో ఐర్లండు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులపై మరో విడత కోతలు, పన్నులు బాదడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం నవంబరు నెలలో ఐర్లండు రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో (చెల్లించగల వడ్డి రేట్లకు మార్కెట్లో అప్పు సేకరించలేని స్ధితి) ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా 67.5 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేస్తూ విషమ షరతులు విధించాయి. కార్మికులు,…