పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్
లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి…