ఆసియా ఆర్ధిక వ్యవస్ధలని కిందికి లాగుతున్న అమెరికా, యూరప్‌ల సంక్షోభాలు
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యంలోకి జారే అవకాశాలు కనిపిస్తున్నాయని సింగపూర్ ఆర్ధిక మంత్రి మంగళవారం జోస్యం చెప్పాడు. మాంద్యం సంభవించకుండా ఉండడం కంటే సంభవించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) గత పది సంవత్సరాలలోనే అత్యంత తక్కువ నమోదు చేయవచ్చని చైనా అధికారి ఒకరు వేరే సందర్భంలో తెలిపాడు. ఏసియాన్ దేశాల కూటమి ద్రవ్య విధానం సమీక్ష కోసం రానున్న శుక్రవారం సమావేశం కానున్నాయి. అమెరికా,…