నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్‌ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!

నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి…

నార్వే హత్యాకాండ నిందితుడితో ఇండియా కనెక్షన్!

జులై 22 తేదీన నార్వేలో సమ్మర్ క్యాంప్ కోలాహలంలో మునిగి ఉన్న టీనేజి యువతీ యువకులు 85 మందిని ఊచకోత కోసిన ముస్లిం ద్వేషి, మితవాద క్రిస్టియన్ తీవ్రవాది ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తో ఇండియాతో గల కనెక్షన్ ఒకటి బైటపడింది. ఆందోళన పడవలసిన కనెక్షన్ కాదు గాని, అనూహ్యమైన కనెక్షన్. బ్రీవిక్ వెబ్‌సైట్ లో ఉంచిన మానిఫెస్టోలో పేర్కొన్న తీవ్రవాద సంస్ధ సభ్యులు ధరించడానికి బ్యాడ్జిని తయారు చేయడానికి ఆయన భారత దేశానికి చెందిన ఒక…

“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…