అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -2
ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని…