బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం
ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…



