అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…