ఎస్-300 సిరియాకి ఇచ్చావో…, రష్యాకి ఇజ్రాయెల్ హెచ్చరిక

సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది. ఇజ్రాయెల్ రక్షణ…

సిరియా: ఇజ్రాయెల్ దూకుడుకి రష్యన్ మిసైల్ ముకుతాడు

సిరియా కిరాయి తిరుగుబాటులో అంతిమ అంకానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.  సిరియా లోని ఒక జాతీయ సైనిక శిబిరం పైకి ఇజ్రాయెల్ చేత ఇప్పటికీ మూడుసార్లు మిసైళ్లతో అమెరికా దాడి చేయించడంతో రష్యా తన శక్తివంతమైన ఎస్-300 మిసైల్ వ్యవస్ధను సిరియాకు సరఫరా చేయడానికి వేగంగా నిర్ణయం తీసుకుంది. ఎస్-300 క్షిపణులు సిరియా ప్రభుత్వం చేతికి వస్తే (ఒక మిసైల్ బ్యాటరీ ఇప్పటికే సరఫరా అయిందని వార్త) అమెరికా పధకాలు దాదాపు తల్లకిందులు అయినట్లే. అమెరికా అమ్ముల…