ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలనుండి యూనివర్సిటీ లాంటి ఉన్నత చదువుల వరకూ రాలేకపోతున్నారని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో తెలిసింది. ఇతర వెనుకబడిన కులాల విద్యార్ధులు వారి జనాభా దామాషాలోనే ఉన్నత స్ధాయి చదువుల వరకూ రాగలుగుతున్నారనీ, కానీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన విద్యార్ధులలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నతస్ధాయి చదువులకు చేరగలుగుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది.…


