బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని

భారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని…

ద్వవ్యోల్బణం అరికట్టే పేరుతో లక్షల కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం ఎసరు

అనుకున్నదే జరగబోతోంది. భారత దేశంలోని లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అరి కట్టడమే తమ ప్రధమ కర్తవ్యం అంటూ రెండేళ్ళనుండి ఆందోళన వ్యక్తం జేస్తూ కూడా ఆ దిశలో ఏ చర్యా తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తన ఆందోళన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని బైటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల బృందానికి అధిపతి అయిన కౌశిక్ బసు శుక్రవారం ప్రభుత్వ ఉద్దేశ్యాలను మెల్లగా బైటపెట్టాడు. భారత దేశ…