చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్
కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…


