బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?

బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…

ఎలక్షన్ కమిషన్: భద్రతా భయంతో గూగుల్ ఒప్పందం రద్దు

భారత ఎలక్షన్ కమిషన్ ఒక భేషయిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల వల్ల కాని పని తనకు చేతనవునని చాటుకుంది. ఓటర్ల సేవల నిమిత్తం గూగుల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ లు ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారులందరి పైనా గూఢచర్యం సాగిస్తున్నాయని, దీనికి గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికన్ ఇంటర్నెట్…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…