ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

తెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. అదిలా ఉంది: మనకు నిత్యం అంతర్జాతీయ వార్తలను ఎర్ర కళ్ళద్దాలతో వీక్షించి వండి వార్చే బ్లాగొకటి ఉంది. అఫ్ కోర్స్, అదేం తప్పు కాదనుకోండి, ప్రతి ఒక్కరం ఒక వార్తని ఏదో ఒక దృక్కోణములోనుంచే…