బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత
2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…
