ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?
ఇండియా, బెలారస్ ల మధ్య పొటాష్ ఎరువులకు సంబంధించి కుదిరిన ఒప్పందానికి అమెరికా మోకాలడ్డినట్లు అనుమానాలు తలెత్తాయి. కేబినెట్ నిర్ణయాలను అమెరికాకి చేరవేయడానికి భారత ప్రభుత్వ కేబినెట్ లో అమెరికా ఏజెంటు ఉన్న అనుమానాలు కూడా వాటికి జత కలిశాయి. పాత సోవియట్ రాజ్యం బెలారస్లోని పొటాషియం గనులను కొనాలనీ, అలాగే విదేశాలలో ఎరువుల గనులను ప్రాధామ్యం ప్రాతిపదికన సొంతం చేసుకోవాలని కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా ఒక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన రోజునే బెలారస్ పై…