ఎమర్జింగ్ దేశాలు ఆంటే అర్ధం ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల వర్గీకరణలో “ఎమర్జింగ్ దేశాలు” అనే కొత్త పదం ఒకటి వచ్చి చేరింది. ఈ పదం చేరక ముందు మూడు రకాల వర్గీకరణ మాత్రమే ఉండేది. అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలను మొదటి ప్రపంచం అని పిలుస్తున్నాము. గతంలో రష్యా, అమెరికాలు రెండు అగ్ర రాజ్యాలు కనుక ఆ రెండు మొదటి ప్రపంచం అన్నారు. ఆ తర్వాత రష్యా పతనం కావటంతో అమెరికా ఒక్కటే మొదటి ప్రపంచంగా ఉంటూ వచ్చింది.…