మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

డాలర్లు: ఇండియాకి వచ్చేదాని కంటే పోయేది రెట్టింపు

మన ప్రధాన మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళరిగేలా తిరిగి దేశానికి రప్పించుకునే పెట్టుబడుల వల్ల ఎవరికీ లాభం కలుగుతోంది? ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోకి వస్తున్న డాలర్ పెట్టుబడుల కంటే దేశం దాటి పోతున్న లాభాల డాలర్లే అధికంగా ఉంటున్నాయి.

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐల నిర్వచనం: సిఫారసులు ఆమోదం

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను…

2 వారాల్లో 7800 కోట్లు పరారీ, అమెరికా మూసివేత ఫలితం

విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం పడని పాట్లే లేవు. ఎన్ని పాట్లు పడినా ఫలితాలు మాత్రం సరిగ్గా విరుద్ధంగా వస్తున్నాయి. దానికి కారణాలు భారత ప్రభుత్వం చేతుల్లో లేకపోవడమే అసలు సమస్య. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ, అనగా రెండు వారాల్లో రు. 7,800 కోట్లు లేదా 1.2 బిలియన్ డాలర్లు దేశం నుండి పరారీ అయ్యాయి. ఈ పలాయనం అమెరికా ప్రభుత్వం మూసివేత ఫలితమేనని పి.టి.ఐ తెలిపింది. భారత ఋణ మార్కెట్ నుండే ఈ మొత్తం…