2013లో రేపిస్టుల్లో 95 శాతం బాధితులకు తెలిసినవారే
ప్రతి 100 మంది రేపిస్టుల్లో 95 మంది బాధితులకు తెలిసినవారేనని జాతీయ నేర నమోదు సంస్ధ (National Crime Record Bureau -NCRB) తెలిపింది. ‘2013లో భారత దేశంలో నేరాలు’ పేరుతో ఎన్‌సిఆర్‌బి నివేదికను విడుదల చేసింది. నివేదికలో మహిళలపై నేరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను పొందుపరిచింది. నివేదిక ప్రకారం అత్యాచార నేరాలకు సంబంధించి ఐ.పి.సి సెక్షన్ 376 కింద 2013 సంవత్సరంలో దేశవ్యాపితంగా 33,707 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 31,807 కేసుల్లో నిందితులందరూ బాధితులకు…