గాలి కబుర్ల పాలనకు ఏడాది -కార్టూన్

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – 2 అధికారం చేపట్టి ఏడాది అవుతోంది. అవడానికి ఎన్.డి.ఏ పాలన అయినప్పటికీ ఆచరణలో ఇది పూర్తిగా బి.జె.పి పాలన. ఈ ప్రభుత్వంపై వాజ్ పేయి భరించిన కూటమి ఒత్తిళ్ళు ఏమీ లేవు. శివసేన లాంటి నోరుగలిగిన భాగస్వాములను సైతం తొక్కి పెట్టగలిగిన ఎన్.డి.ఏ-2 పాలన పూర్తిగా బి.జె.పి పాలనగా చెప్పుకున్నా తప్పు లేదు. ఈ ఏడాది పాలన ఒట్టి గాలి కబుర్ల పాలనగా సాగిపోయిందని కార్టూనిస్టు సరిగ్గా చెప్పారు. ఇంకా చెప్పాలంటే…