ఇసిస్ లో చేరిన ఇండియన్ తిరిగి రాక

ఇరాక్, సిరియాలలో భూభాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పరిచిందని అమెరికా ప్రకటించిన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ సంస్ధ లో చేరిన భారతీయుడు వెనక్కి వచ్చేశాడని ది హిందు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాయబార ఛానెళ్ల ద్వారా ప్రయత్నాలు చేయడంతో ఆరిఫ్ మజీద్ క్షేమంగా దేశానికి చేరుకున్నాడని పత్రిక తెలిపింది. మోసుల్ లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆరిఫ్ చనిపోయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆరిఫ్ తో పాటు వెళ్ళిన మరో…

ఇటలీ మెరైన్ కేసు: ఇండియా వెనకడుగు?

ఇటలీ, ఇ.యు ల నుండి వచ్చిన ఒత్తిడికి భారత ప్రభుత్వం తల వంచినట్లు కనిపిస్తోంది. పైరసీ చట్టాన్ని ప్రయోగించడం లేదని కేంద్రం ఈ రోజు సుప్రీం కోర్టుకు తెలిపింది. యాంటీ-పైరసీ యాక్ట్ (సముద్ర దోపిడి వ్యతిరేక చట్టం) ప్రకారం తమ మెరైన్ సైనికులను విచారించడానికి ఇండియా సిద్ధపడడం పట్ల ఇటలీతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాను అనుకున్నట్లుగా ఇండియా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన ప్రతిస్పందన ఖాయం…

150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది

బహుశా ఇంత మొత్తంలో డబ్బు, నగలు, వజ్రాలు పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత విలువ ఉంటుందో తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టేటంత డబ్బు, నగలివి. ముంబై రైల్వే స్టేషన్ నుండి గుజరాత్ కు రవాణా కానుండగా పట్టుబడింది. 40 మంది అంగడియాలు నాలుగు ట్రక్కుల్లో, 150 గోతాల్లో నింపుకుని డబ్బు కట్టలు, బంగారు నగలు, వజ్రాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), ఇన్ కమ్…

ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ,…