గూఢచారుల పేర్లివ్వండి! -ఎంబసీలకు జర్మనీ ఆదేశం
జర్మనీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లాంటి అమెరికా గూఢచార సంస్ధలతో విసిగిపోయి ఇక ఎంత మాత్రం సహించలేని దశకు చేరుకున్నట్లుగా సంకేతాలిస్తూ దేశంలోని విదేశీ ఎంబసీలన్నీ తమ గూఢచార అధికారుల పేర్లను వెల్లడించాలని ఆదేశించింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తున్న గూఢచారులందరి పేర్లను తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విదేశీ ఎంబసీలన్నింటికీ జర్మనీ ప్రభుత్వం గత వారం లేఖలు రాసిందని పత్రికలు సమాచారం ఇచ్చాయి. జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ…




