ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్
మేనిఫెస్టో: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేస్తాం. జనం: ఇదిగో ఈ ఒక్క పేజీని మీ మేనిఫెస్టో చెయ్యండి చాలు! *** రాజకీయ పార్టీలు ప్రస్తుతం మేనిఫెస్టోల జాతరలో మునిగి తేలుతున్నాయి. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేయగా బి.జె.పి దాన్ని అబద్ధాలు, మోసపూరితం అంటూ కొట్టిపారేస్తోంది. అక్కడికి బి.జె.పి మేనిఫెస్టో పక్కా నిజాయితీతో తయారు చేసినట్టు! ది హిందు పత్రిక ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో…