అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు
భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…