కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…