రష్యాపై ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అమెరికా కంపెనీ
ఉక్రెయిన్ లో వినాశపూరితంగా జోక్యం చేసుకున్న అమెరికా, జోక్యాన్ని ఎదిరిస్తున్న రష్యాపై మూడు విడతలుగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను అమెరికా బహుళజాతి చమురు కంపెనీ ఎక్సాన్ మొబిల్ పచ్చిగా ఉల్లంఘిస్తోంది. రష్యా చమురు కంపెనీ రోస్ నేఫ్ట్ పై అమెరికా ఆంక్షలు విధించగా, వాటిని ఉల్లంఘిస్తూ రష్యన్ ఆర్కిటిక్ లో చమురు అన్వేషణకు ఎక్సాన్ మొబిల్ నడుం బిగించింది. ఆర్కిటిక్ సముద్రంలో అత్యధిక భాగం రష్యా తీరంలో భాగంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యాన ఆర్కిటిక్…