ఎకె-47 సృష్టికర్త కలష్నికోవ్ మరణం
ఈ రోజుల్లో ఎకె-47 రైఫిల్ గురించి విననివారు బహుశా ఎవరూ ఉండరు. చిన్న పిల్లాడి దగ్గర్నుండి పండు ముదుసలి వరకూ ప్రపంచ వ్యాపితంగా ఈ రైఫిల్ సాధించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యం. ఎటువంటి వాతావరణంలోనైనా తనను ధరించిన వారి అంచనాలను ఏ మాత్రం తప్పని లక్షణం వల్లనే ఎకె-47 రైఫిల్ అంతగా పేరు సంపాదించింది. అలాంటి ఎకె-47 సృష్టికర్త మిఖాయిల్ కలష్నికోవ్ తన 94 వ యేట సోమవారం ఉద్ముర్తియా రిపబ్లిక్ రాజధాని ఇఝెవ్స్క్ లో మరణించారు.…
