ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…